Donald Trump :ట్రంప్ దోషే కానీ… శిక్షేమీ విధించట్లేదు

హష్ మనీ కేసులో అమెరికా కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump ) కు శిక్ష నుంచి బేషరతుగా మినహాయింపు ఇస్తున్నట్టు (అన్‌కండిషనల్ డిశ్చార్జ్) న్యూయార్క్ కోర్టు (New York court ) ప్రకటించింది. మన్‌హాటన్ జడ్జి జువాన్ ఎం. మర్చన్ (Juan M. Marchan) ఈ మేరకు తీర్పు వెలువరించారు. ట్రంప్ దోషేనని ఆయన పునరుద్ఘాటించారు. అయినా ముందే ప్రకటించిన మేరకు ట్రంప్‌కు శిక్ష గానీ, జరిమానా గానీ విధించడం లేదని స్పష్టం చేశారు. అధ్యక్షునిగా ట్రంప్‌కు సంక్రమించబోయే అపరిమితమైన అధికారాలు, న్యాయపరమైన రక్షణలు శిక్ష నుంచి మినహాయింపు కల్పిస్తాయే తప్ప కోర్టు తీర్పును అడ్డుకోజాలవు. అధ్యక్షునిగా ఆయన పాలన పగ్గాలు చేపట్టాల్సిన ఆవశ్యకత ఒకవైపు. చట్టానికి ఎవరూ అతీతు కారాదన్నా ప్రజల ఆకాంక్షలు మరోవైపు. ఈ రెండిరటీని బ్యాలెన్స్ చేస్తూ ఇలా తీర్పు ఇవ్వాల్సి వచ్చింది అని వివరించారు. దాంతో ఇది తనకో దారుణమైన అనుభవమంటూ ట్రంప్ వాపోయారు.