American Consulate: అమెరికా కాన్సులేట్ సరికొత్త రికార్డు
వరుసగా రెండో ఏడాది భారతీయులకు (Indians) రికార్డు స్థాయిలో 10 లక్షలకు పైగా వలసేతర వీసా ( నాన్ ఇమిగ్రెంట్) (Non-immigrant) లను మంజూరు చేసినట్లు హైదరాబాద్లోని అమెరికా కాన్సులేట్ (American Consulate) తెలిపింది. భారత్తో బలమైన ద్వైపాక్షిక సంబంధాలు పెంపొందించేందుకు, అసాధారణమైన కాన్సులర్ సేవలు అందించేందుకు అమెరికా మిషన్ అంకితభావంతో పనిచేస్తున్నట్లు పేర్కొంది. 2024లో సాధించిన విజయాలు అమెరికా మిషన్ సిబ్బంది, పనితీరు, అంకితభావం, అమెరికా-భారత్ సంబంధాల భాగస్వామ్యానికి నిదర్శమని కాన్సులేట్ ఒక ప్రకటనలో వెల్లడిరచింది.






