America : అమెరికా మరో కీలక నిర్ణయం … నేపాల్‌కు

అగ్రరాజ్యం అమెరికా (America) మరో కీలక నిర్ణయం తీసుకుంది. నేపాల్ (Nepal)కు అందిస్తున్న తాత్కాలిక రక్షణ హెదా (టీపీఎస్)ను రద్దు చేసింది. ఈ విషయాన్ని యూఎస్ హోమ్‌ల్యాండ్ రక్షణ విభాగం( డీహెచ్‌ఎస్) అధికారికంగా ప్రకటించింది. తాజా నిర్ణయంతో అమెరికాలో నివాసం ఉంటున్న దాదాపు 7 వేల మంది నేపాలీ వాసులు తిరిగి స్వదేశం చేరుకోనున్నారు. ఇందుకోసం వారికి 60 రోజులు గడువు విధించారు. 2015లో నేపాల్‌ను భారీ భూకంపం కుదిపేసినప్పుడు అక్కడి పౌరులకు మానవతా దృక్పథంతో అమెరికా టీపీఎస్ (TPS) ను మంజూరు చేసింది. దీని ద్వారా నేపాలీలు అమెరికాలో తాత్కాలికంగా నివసించడానికి, చట్టబద్దంగా పనిచేసుకోవడానికి వీలు కలిగింది. అయితే 2015 నాటి పరిస్థితులతో పోలిస్తే ప్రస్తుతం నేపాల్‌లో సాధారణ పరిస్థితులు నెలకొన్నాయని, అందుకే టీపీఎస్‌ను కొనసాగించాల్సిన అవసరం లేదని అమెరికా ప్రభుత్వం (US Government) ఈ నిర్ణయాన్ని సమర్థించుకుంది.