Green card: పత్రాలన్నీ వెంట ఉండాల్సిందే : అమెరికా హెచ్చరిక

అసలు కంటే కొసరు పనే ముఖ్యమన్న తరహా లో అమెరికా ప్రభుత్వం వ్యవహరిస్తోంది. ఎలాగూ వీసా నిబంధనలు, ఎయిర్‌పోర్ట్‌లో క్షుణ్ణంగా తనిఖీలు దాటుకొని అమెరికాలోకి అడుగుపెట్టినా దాదాపు ప్రతి ఒక్క అమెరికాయేతర వ్యక్తులంగా ఎక్కడ పడితే అక్కడ అధికారులు అడిగే అన్ని రకాల డాక్యుమెంట్లను చూపించాల్సిందేనని డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) సర్కార్ హెచ్చరించింది. ఈ మేరకు అమెరికా కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్స్ ( సీబీపీ) విభాగం హెచ్చరికలు జారీ చేసింది. గ్రీన్‌కార్డ్ (Green card) సాధించిన వ్యక్తులు సహా అమెరికా పౌరసత్వం పొందని వారంతా నిరంతరం తమ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లను తమ వెంటేసుకుని తిరిగాల్సిందేనని సీబీపీ (CBP) పేర్కొంది. అధికారులు అడిగినప్పుడు చూపించకపోతే జరిమానా ముప్పు తప్పదని, కొన్ని సార్లు అత్యల్పస్థాయి నేరాభియోగాలను సైతం ఎదుర్కోవాల్సి ఉంటుందని సీబీపీ హెచ్చరించింది. 18 ఏళ్లు, ఆపైబడిన వారందరికీ ఇదే నియమం వర్తించనుంది. దీంతో విద్య, ఉద్యోగాల కోసం వచ్చే భారతీయులు (Indians) , వారి వెంట వచ్చే కుటుంబసభ్యులు, చిన్నారులకు కొత్త సమస్య వచ్చిపడిరది. సినిమా, షాపింగ్, పార్క్, హోటల్, ఆస్పత్రి (Hospital) , రైల్వేస్టేషన్ ఇలా ఎక్కడికి వెళ్లినా ముఖ్యమైన రిజిస్ట్రేషన్ పత్రాలు పట్టుకెళ్లడమంటే ఎంతో ఇబ్బందితో కూడిన వ్యవహారం. అక్రమంగా వలసవచ్చారని ఏక్షణాన ఎవరిపై అనుమానం వచ్చినా వెంటనే అధికారులు సోదాలు, తనిఖీలు చేసేందుకు వీలుగా విదేశీయలకు ఈ అడ్వైజరీని జారీ చేసినట్లు సీబీపీ తెలిపింది.