Donald Trump: ట్రంప్ హామీ ఇచ్చాకే రెండు దేశాల మధ్య ..కాల్పుల విరమణ

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) మధ్యవర్తిత్వం వహించి రెండు దేశాలకు వాణిజ్య ఉపశమనం కల్పిస్తానని హామీ ఇచ్చాకే భారత్ (India), పాకిస్థాన్‌లు (Pakistan) కాల్పులు విరమణకు అంగీకరించాయని అమెరికా ప్రభుత్వం వెల్లడిరచింది. ఈ కారణంగానే పూర్తిస్థాయి యుద్ధాన్ని నివారించగలి గామని న్యూయార్క్ కోర్టు (New York court) కు తెలిపింది. కాల్పుల విరమణలో మూడో దేశం జోక్యం లేదని భారత్ (India) ప్రకటించిన నేపథ్యంలో ఈ అంశంపై అమెరికా మళ్లీ అదే వాదనను వినిపిచండం గమనార్హం. సుంకాలను విధించేందుకు అమెరికా అధ్యక్షుడికి ఉన్న అంతర్జాతీయ అత్యవసర ఆర్థిక అధికారాల చట్టంలో ని (ఐఈఈపీఏ) తన అధికార పరిధిని అతిక్రమించారని, దేశ వాణిజ్య విధానం తన వెర్రి ఆలోచనలకు అనుగుణంగా పని చేయాలని కోరుకుంటున్నారంటూ దాఖలైన పిటిషన్లపై విచారణ సందర్భంగా అమెరికా ఈ వాదననలను వినిపించింది. అమెరికా జాతీయ భద్రత, ఆర్థిక వ్యవస్థలకు రక్షణ కల్పించే అంతర్జాతీయ అత్యవసర ఆర్థిక అధికారాల చట్టం లోని (ఐఈఈపీఏ) అధికారాలను ఉపయోగించుకుని ట్రంప్ రెండు దేశాల మధ్య ఒప్పందం కుదర్చగలిగారు అని అంతర్జాతీయ వాణిజ్య న్యాయస్థానంలో అమెరికా వాణిజ్య మంత్రి హోవర్డ్ లుత్నిక్ (Howard Lutnick) వాదనలు వినిపించారు.