అమెరికా ఎన్నికలపై రష్యా తప్పుడు ప్రచారం
అమెరికాలో ఈ ఏడాది నవంబరులో జరిగే అధ్యక్ష ఎన్నికలను ప్రభావితం చేసేలా రష్యా తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తోందని అగ్రరాజ్యం అమెరికా ఆరోపించింది. అమెరికాకు చెందిన ఇన్ఫ్లుయెన్సెర్లను వారికి తెలియకుండానే ప్రభావితం చేస్తూ రష్యా జాతీయ మీడియాలో ప్రచారానికి ఉపయోగించుకుంటోందని బైడెన్ సర్కారు పేర్కొంది. ఈ క్రమంలో మీడియా సంస్థ ఆర్టీపై అమెరికా ప్రభుత్వం ఆంక్షలు విధించింది. తప్పుడు సమాచారాన్ని ప్రచారంలోకి తీసుకువచ్చే ఉపకరణాలపై నేరాభియోగాల నమోదు, ఇంటర్నెట్ డొమైన్స్ జప్తులను కూడా ప్రకటించింది.






