US Supreme Court :అమెరికా సుప్రీంకోర్టు లో తహవూర్ రానా పిటిషన్
తనను భారత్కు అప్పగించే అంశంపై దిగువ కోర్టులు ఇచ్చిన తీర్పులపై సమీక్షించాలని కోరుతూ 2008 ముంబయి ఉగ్రదాడి కేసు నిందితుడు తహవూర్ రాణా (Tahavor Rana) అమెరికా సుప్రీంకోర్టు (US Supreme Court )ను ఆశ్రయించాడు. ఈ మేరకు అతడి తరపు న్యాయవాది పిటిషన్ వేశాడు. రాణాను తమకు అప్పగించాలని అమెరికాను భారత్ (India) కోరుతున్న సమయంలో రాణా అక్కడి దిగువ న్యాయస్థానాలు, ఫెడరల్ కోర్టు (Federal Court) లను ఆశ్రయించాడు. వాటిలో అతడికి వ్యతిరేకంగా తీర్పు రావడంతో నవంబరు 13న సుప్రీంకోర్టులో పిటిషన్ వేశాడు. ఈ అంశంపై ఈ నెల 17న విచారణ చేపడతామని అమెరికా సుప్రీంకోర్టు పేర్కొంది.






