Donald Trump: డొనాల్డ్ ట్రంప్, ఉక్రెయిన్ మధ్య రష్యా చిచ్చు !
అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్న డొనాల్డ్ ట్రంప్, ఉక్రెయిన్ మధ్య చిచ్చు పెట్టే వ్యూహానికి రష్యా పదునుపడుతోందా? అవుననే అంటున్నాయి అమెరికా (America) గూఢచర్య వర్గాలు. వీరి కథనం ప్రకారం ఉక్రెయిన్, అమెరికా అధ్యక్షునిగా ఎన్నికైన ట్రంప్(Trump) పై తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసేందుకు రష్యా (Russia) నకిలీ న్యూస్ సైట్లను వాడుకుంటోంది. ఈ సైట్లు ప్రస్తుత కీలక సమయంలో ఉక్రెయిన్పై అమెరికన్లలో వ్యతిరేకత పెంచేందుకు శాయశక్తులా కృషి చేస్తున్నాయి. ఉక్రెయిన్ సైనికులు ట్రంప్, ఆయన మద్దతుదారుల దిష్టిబొమ్మలు తగలబెడుతున్నట్టుగా నకిలీ చిత్రాలు, ఫేక్ వీడియోలు అమెరికాలో విస్తృత ప్రచారంలో ఉన్నాయి.






