Donald Trump: తమ డిమాండ్‌ను అంగీకరించకుంటే.. కఠిన చర్యలు

బగ్రామ్ వైమానిక స్థావరాన్ని తిరిగి తమకు అప్పగించాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) అఫ్గానిస్థాన్ (Afghanistan) ను కోరారు. తన డిమాండ్‌ను అంగీకరించకుంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అమెరికా నిర్మించిన బగ్రామ్ (Bagram) ఎయిర్‌బేస్‌ను ఇవ్వకుంటే తాలిబన్ ప్రభుత్వంపై ఎవరూ ఊహించని చర్యలు తీసుకుంటాం అని పేర్కొన్నారు. చైనా (China) అణు క్షిపణులు తయారు చేసే ప్రదేశానికి సమీపంలో ఉన్న అత్యంత వ్యూహాత్మకమైన ప్రాంతం ఇది. అఫ్గాన్ నుంచి అమెరికా బలగాలు వైదొలగినప్పటి నుంచి ఈ ఎయిర్ బేస్ ఆ దేశ ఆదీనంలోనే ఉంది.