Donald Trump: ట్రంప్ తొలి విదేశీ పర్యటన.. ఏ దేశానికంటే?

శరవేగంగా ముందుకు సాగుతున్న టెహ్రాన్ అణు కార్యక్రమంపై మరిన్ని చర్చలకు ఈ వారాంతంలో ఇరాన్, అమెరికా ప్రతినిధులు ఒమన్ వేదికగా భేటీ కానున్నారు. గతంలో మూడు విడతలుగా జరిగిన చర్చలకు కొనసాగింపుగా ఒమన్‌లో ఈ సమవేశం జరగనున్నట్లు ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరగ్ఛీ (Abbas Aragchi) తెలిపారు. అబ్బాస్‌తో అమెరికా మధ్యప్రాచ్య రాయబారి స్టీవ్ విట్‌కాఫ్ (Steve Witkoff) సమావేశమవుతారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. అబ్బాస్‌తో అమెరికా మధ్యప్రాచ్య రాయబారి స్టీవ్ విట్‌కాఫ్ సమావేశమవుతారని విశ్వసీయ వర్గాలు తెలిపాయి. ఈ ఇద్దరి మధ్య పరోక్ష, ప్రత్యక్ష చర్చలు ఉంటాయని చెప్పారు. రెండోసారి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) వచ్చే వారం సౌదీ అరేబియా (Saudi Arabia) , ఖతర్ (Qatar) , యునైటడ్ అరబ్ ఎమిరేట్స్ (United Arab Emirates) పర్యటనకు రానున్న నేపథ్యంలో జరుగుతున్న ఈ చర్చల వివరాలను తక్షణం వెల్లడిరచేందుకు ఇరాన్ సుముఖత చూపలేదు. తన గరిష్ఠ ఒత్తిడి కార్యక్రమంలో భాగంగా ట్రంప్ ఇరాన్‌పైనా కొత్త ఆంక్షలు విధించారు. ఇరాన్‌పై సైనికచర్య గురించి కూడా పదే పదే మాట్లాడారు. అయినా ఇరాన్ సుప్రీం నేత ఆయతొల్లా ఖమేనీ కి రాసిన లేఖలో కొత్త ఒప్పందం కుదిరే అవకాశం లేకపోలేదన్న ఆశాభావంతో ఉన్నారు.