Donald Trump: భేటీ తర్వాత యుద్ధాన్ని ఆపకపోతే తీవ్ర పరిణామాలు : పుతిన్‌కు ట్రంప్ హెచ్చరిక

అలస్కాలో శుక్రవారం జరిగే తమ భేటీ తర్వాత రష్యా అధ్యక్షుడు పుతిన్ (Putin) యుద్ధాన్ని ఆపకపోతే అత్యంత తీవ్ర పరిణామాలుంటాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) హెచ్చరించారు. ఉక్రెయిన్ తరపునా భూభాగం విషయంలోనే చర్చలుంటాయని స్పష్టం చేశారు. ఈ విషయంలో డొనాల్డ్ ట్రంప్ చాలా స్పష్టంగా ఉన్నారని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్ (Emmanuel Macron) తెలిపారు. బుధవారం ఐరోపా నేతలతో ట్రంప్ వర్చువల్‌గా సమావేశమయ్యారు. ఇందులో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ (Zelensky) పాల్గొన్నారు. సమావేశ వివరాలను మెక్రాన్ మీడియాకు వివరించారు. భవిష్యత్తులో త్రైపాక్షిక సమావేశం ( ట్రంప్, పుతిన్, జెలెన్‌స్కీ) జరగాలని ట్రంప్ కోరుకుంటున్నారని తెలిపారు. పుతిన్ మోసం చేస్తున్నారని సమావేశంలో జెలెన్‌స్కీ తెలిపారు.