Obama : ఒబామాను వెంటాడుతున్న ట్రంప్!

అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా (Barack Obama) ను అరెస్టు చేస్తున్నట్లుగా ఉన్న ఓ ఏఐ వీడియో ను ఇటీవల అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump ) షేర్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఒబామాను అపహాస్యం చేస్తూ ట్రంప్ మరో మీమ్ పోస్టు చేశారు. అందులో ఒబామా తెల్లటి ఫోర్డ్ బ్రోంకో కారు (Ford Bronco car)లో పారిపోతుండగా ట్రంప్, ఉపాధ్యక్షుడు వాన్స్ (Vance) ఇతర అధికారులు ఆయనను పోలీసు వాహనాల్లో వెంబడిస్తున్న దృశ్యాలు ఉన్నాయి. ఈ పోస్టుకు వాన్స్ నవ్వుతున్న ఎమోజీని జత చేయడంతో ట్రంప్ యంత్రాంగం ఒబామాపై ఎలాంటి చర్యలు తీసుకోనుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల యూఎస్ నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ తులసీ గబ్బార్డ్ ఒబామా (Tulsi Gabbard )పై సంచలన ఆరోపణలు చేసిన అనంతరం ట్రంప్ వరుస పోస్టులు పెట్టడం గమనార్హం.