డొనాల్డ్ ట్రంప్ మరో కీలక నిర్ణయం… యూఎస్ మిలటరీ నుంచి
అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ పరిపాలనకు సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అమెరికా మిలిటరీ నుంచి ట్రాన్స్జెండర్లను తొలగించే దిశగా చర్యలకు ఉపక్రమిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. దీంతో ఆ కమ్యూనిటీలో భయాందోళనలు నెలకొంటున్నాయి. ప్రస్తుతం అమెరికా మిలిటరీలో దాదాపు 15,000 మంది ట్రాన్స్జెండర్లు విధులు నిర్వర్తిస్తున్నట్లు అధికారిక వర్గాలు వెల్లడిరచాయి. ట్రంప్ మొదటిసారి అధికారంలోకి వచ్చిన సమయంలో కూడా ట్రాన్స్జెండర్లు సాయుధ దళాల్లో చేరకుండా ఉత్తర్వులు జారీ చేశారు. అయితే అప్పటికే మిలిటరీలో పనిచేస్తున్న వారిని కొనసాగించారు. కాగా ప్రస్తుతం మిలిటరీలో పని చేస్తున్నవారిని కూడా తొలగించనున్నట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. దీనికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులు జనవరి 20న జారీ చేయనున్నట్లు సమాచారం.






