Donald Trump : డొనాల్డ్ ట్రంప్ మరోసారి.. భారత్‌పై
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) మరోసారి సంచలనాత్మక నిర్ణయం తీసుకున్నారు. రష్యా (Russia) నుంచి చమురు కొనుగోళ్లు చేస్తున్న కారణంతో భారత్ (India) పై తాజాగా మరో 25 శాతం అదనపు సుంకం విధిస్తూ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై సంతకం చేశారు. ఇప్పటికే భారత్‌పై అమల్లో ఉన్న 25 శాతం సుంకంతో కలిపితే, మొత్తం 50 శాతం సుంకం వర్తించనుంది. ఇప్పటికే భారత్‌పై 24 గంటల్లో భారీ చర్యలు ఉంటాయి అని ట్రంప్ హెచ్చరించగా, అనుకున్నట్టు గానే వెంటనే చర్యలు జరిగింది.
పాత 25 శాతం సుంకాలు ఆగస్టు (August) 7 నుంచి అమల్లోకి రానుండగా, కొత్తగా విధించిన అదనపు 25 శాతం టారిఫ్‌లు ఆగస్టు 27 నుంచి అమల్లోకి వస్తాయని ట్రంప్ పేర్కొన్నారు. అమెరికా అంతర్జాతీయ వాణిజ్య సంబంధాల్లో పునరుద్ధరణ చర్యలలో భాగంగా భారత్‌పై ట్రంప్ ఈ నిర్ణయాలు తీసుకున్నట్టు స్పష్టం చేస్తున్నారు.మరోవైపు భారత్ ప్రతీకార చర్యలు తీసుకుంటే, ట్రంప్ ఈ టారిఫ్‌లను మరింత పెంచే అవకాశమూ ఉందని వైట్ హౌస్ (White House) హెచ్చరించింది. దీంతో భారత్‌పై మరింత ఆర్థిక ఒత్తిడి తలెత్తే అవకాశముంది.






