Donald Trump : భారత్‌తో ఎలాంటి చర్చలు ఉండవు : ట్రంప్

సుంకాలపై వివాదం పరిష్కారం అయ్యే వరకు భారత్‌తో వాణిజ్య చర్చలు జరిపే ప్రసక్తి లేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) స్పష్టం చేశారు. వాషింగ్టన్‌లోని తన ఓవల్ ఆఫీసు (Oval Office)లో ట్రంప్ విలేకరులతో మాట్లాడుతూ భారత్ (India)తో చర్చలు జరిపే అవకాశాన్ని తోసిపుచ్చారు. అదనపు సుంకాలు విధించిన తర్వాత భారత్‌తో చర్చలు జరిగే అవకాశం ఉందా అన్న ప్రశ్నకు తమ రెండు దేశాల మధ్య సుంకాల వివాదం పరిష్కారం కానంత వరకు భారత్‌తో చర్చలు జరిపే అవకాశం లేదని చెప్పారు.
రష్యా (Russia) నుంచి చమురు కొనుగోలును కొనసాగిస్తున్న భారత్‌పై అదనంగా 25 శాతం ప్రతీకార సుంకాలను విధిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. దీంతో భారత్‌పై విధించిన మొత్తం సుంకం 50 శాతానికి చేరుకుంది. మొదట విధించిన 25 శాతం సుంకం ఆగస్టు 7న అమలులోకి రాగా తాజాగా విధించిన అదనపు సుంకాలు 21 రోజుల తర్వాత ఆగస్టు 27 నుంచి అమలులోకి రానున్నాయి.