జెలెన్స్కీకి డొనాల్డ్ ట్రంప్ హామీ.. రష్యాతో
చర్చల ద్వారా రష్యాతో జరుగుతున్న ఘర్షణ ఆగేలా చూస్తానని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ కి డొనాల్డ్ ట్రంప్ భరోసా ఇచ్చారు. తమ మధ్య మంచి సంభాషణ జరిగిందని వెల్లడించారు. జెలెన్స్కీ, నేను ఫోన్లో మాట్లాడుకున్నాం. రిపబ్లికన్ పార్టీ జాతీయ సదస్సు విజయవంతమైనందుకు ఆయన నాకు అభినందనలు తెలిపారు. అలాగే నాపై జరిగిన దాడిని ఆయన తీవ్రంగా ఖండిరచారు అని తెలిపారు. నవంబర్లో జరిగే ఎన్నికల్లో గెలిస్తే జనవరిలో అధికారం చేపట్టకముందే ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగిస్తానని ట్రంప్ వెల్లడిరచారు. 2022లో తాను అధికారంలో ఉండి ఉంటే, అసలు ఈ యుద్ధం జరిగేది కాదన్నారు. చర్చల ద్వారా యుద్ధాలను ముగించి, శాంతిని తీసుకువస్తానని తెలిపారు.






