NASA : ఆ నిర్ణయం వెనక్కి తీసుకున్న ట్రంప్.. త్వరలోనే కొత్త చీఫ్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ప్రభుత్వం నుంచి స్పేస్‌ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ (Elon Musk) బయటకు వచ్చేసిన నేపథ్యంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎన్నికల్లో గెలిచిన తర్వాత జరిపిన నియామకాల్లో మస్క్ స్నేహితుడు, ప్రైవేట్ వ్యోమగామి జేర్డ్ ఐజాక్‌మెన్ (Jared Isaacman) ను నాసా చీఫ్‌గా నామినేట్ చేస్తున్నట్లు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా ఆ ప్రతిపాదనను వెనక్కి తీసుకుంటున్నట్లు ఆయన ప్రకటించారు. ఐజాక్‌కు గతంలో కొన్ని సంస్థలతో ఉన్న సంబంధాలను క్షుణ్నంగా పరిశీలించిన తర్వాత ఈ నిర్ణయానికి వచ్చినట్లు వెల్లడిరచారు. త్వరలోనే నాసా (NASA ) కు కొత్త చీఫ్‌ను ప్రకటిస్తామని పేర్కొన్నారు.