Canada: కెనడాకు డొనాల్డ్ ట్రంప్ ఆఫర్.. అలా చేస్తే ఫ్రీ

తమ దేశంలో 51వ రాష్ట్రంగా చేరితే గగనతల రక్షణ కవచం గోల్డెన్ డోమ్‌ను ఉచితంగా ఇస్తామని కెనడా (Canada )కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ఆఫర్ ఇచ్చారు. లేదంటే 61 బిలియన్ డాలర్లు ఖర్చు చేయాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. మా అద్భుతమైన గోల్డెన్ డోమ్ (Golden Dome) వ్యవస్థలో భాగం కావాలంటే కెనడాకు 61 బిలియన్ డాలర్లు ఖర్చవుతుందని చెప్పా. కానీ అమెరికా (America) కు 51వ రాష్ట్రంగా మారితే దీనికి జీరో డాలర్లు ఖర్చవుతాయి. వారు ఈ ఆఫర్‌ను పరిశీలిస్తున్నారు అని ట్రంప్ పేర్కొన్నారు. ట్రంప్ వ్యాఖ్యలపై కెనడా నుంచి ఎటువంటి స్పందన రాలేదు.