Donald Trump: ట్రంప్ కీలక ప్రకటన.. చైనాతో

అమెరికా, చైనా నడుమ రెండు నెలల వాణిజ్య విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) కీలక ప్రకటన చేశారు. ఇరుదేశాల మధ్య వర్తక ఒప్పందం ఖరారైనట్టు ట్రంప్ ప్రకటించారు. లండన్ (London)లో రెండు రోజుల సంప్రదింపుల అనంతరం ఈ పరిణామం చోటుచేసుకుంది. ఇక నేను, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ (Jinping) తుది ఆమోదముద్ర వేయడమే తరువాయి అని ఆయన వెల్లడిరచారు. ఇకపై చైనా (China )దిగుమతులపై అమెరికా 55 శాతం సుంకాలు విధిస్తుంది. అమెరికా ఉత్పత్తులపై చైనా 10శాతం టారిఫ్‌లు వసూలు చేస్తుంది అని వివరించారు. విభేదాలు ముదిరిన నేపథ్యంలో అమెరికాకు మ్యాగ్నెట్లు మొదలుకుని 17 రకల అరుదైన ఖనిజాలు తదితరాల ఎగుమతులపై నిషేధాన్ని కూడా చైనా ఎత్తేయనుందని తెలిపారు.