Donald trump : అమెరికాలో కెనడా విలీనంపై మరోసారి ఆలోచించండి : ట్రంప్
కెనడా ప్రధానిగా రాజీనామా చేస్తున్నట్లు జస్టిన్ ట్రూడో (Trudeau) ప్రకటించిన కొన్ని గంటల్లోనే అమెరికా కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald trump ) గతంలో తాను చేసిన 51వ రాష్ట్రం విలీనం ప్రతిపాదనను మరోసారి తెరపైకి తెచ్చారు. అమెరికా అధ్యక్షుడిగా తన గత పదవీకాలం(2017`21)లోనూ కెనడా (Canada )తో సత్సంబంధాలు లేని ట్రంప్, రెండోసారి అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు చేపట్టాక కెనడా దిగుమతులపై 25 శాతం సుంకాలు విధిస్తానని హెచ్చరించిన విషయం తెలిసిందే. అమెరికాతో తనకున్న దక్షిణ సరిహద్దు మీదుగా మాదకద్రవ్యాల రవాణా, అక్రమ వలసలను కెనడా ఆపకపోతే సుంకం విధింపు తప్పని ట్రంప్ స్పష్టం చేశారు. ఇప్పుడు ట్రూడో రాజీనామా ప్రకటన వెలువడిన నేపథ్యంలో ట్రంప్ మరోమారు స్పందించారు.






