Russia : రష్యా నుంచి అమెరికాకు దిగుమతులా .. నాకేమీ తెలియదు

రష్యా నుంచి తమ దేశం యురేనియం, ఎరువులు, రసాయనాలు దిగుమతి చేసుకుంటున్న విషయాన్ని తనకేమీ తెలియదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) వ్యాఖ్యానించారు. రష్యా (Russia) తో అమెరికా వాణిజ్యం కొనసాగిస్తోందంటూ భారత్ (India) చేసిన ఆరోపణపై అడిగిన ప్రశ్నకు ట్రంప్ పై విధంగా స్పందించారు. అమెరికా(America) , ఈయూ (EU) లు రష్యాతో వాణిజ్యం కొనసాగిస్తూ తమను వారిస్తున్నాయని, ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తున్నాయని భారత్ ఘాటుగా విమర్శించిన సంగతి తెలిసిందే.