Donald Trump : ట్రంప్ కుమారుడికి సీటు ఇవ్వలేదనే హార్వర్డ్‌పై కక్షా?

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) చిన్న కుమారుడు బారన్ (Barron ) కు సీటు నిరాకరించడం వల్లే హార్వర్డ్‌పై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ప్రచారం జరుగుతోంది. బారన్‌కు హార్వ్‌ర్డ్, కొలంబియా (Colombia), స్టాన్‌ఫోర్డ్ వర్సిటీ (Stanford University) సీటు నిరాకరించడంతో న్యూయార్క్ యూనివర్సిటీ స్టెర్న్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో ఫైనాన్‌స చదవడానికి అడ్మిషను తీసుకున్నట్లు తెలిసింది. అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా కుమార్తె మలియా (Malia)కు యూనివర్సిటీలో సీటు ఇచ్చిన హార్వర్డ్, బారన్‌కు మాత్రం నిరాకరించడంతో అందుకు ప్రతీకారంగానే ట్రంప్ ఈ చర్యలు తీసుకున్నారని తెలిసింది. ఈ ప్రచారాన్ని హార్వర్డ్ విశ్వవిద్యాలయం (Harvard University) ఖండిరచింది. ట్రంప్ సతీమణి మెలానియా కార్యాలయం స్పందిస్తూ.. బారన్ అసలు హార్వర్డ్‌కు దరఖాస్తే చేయలేదని వివరణ ఇచ్చింది.