Putin : పుతిన్ కలవాలనుకుంటున్నారు.. భేటీ ఏర్పాటు చేస్తా
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్(Putin) తనతో భేటీ కావాలని కోరుకుంటున్నారని అమెరికాకు కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump ) పేర్కొన్నారు. రిపబ్లికన్ గవర్నర్లతో భేటీ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పుతిన్‌తో సమావేశానికి ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. అయితే ఎప్పుడు అనే విషయం మాత్రం వెల్లడిరచలేదు. తాను అధికారంలోకి వచ్చిన అనంతరం రష్యా-ఉక్రెయిన్ (Russia-Ukraine )ల మధ్య జరుగుతున్న యుద్ధం వీలైనంత త్వరగా ముగిసేలా చర్యలు తీసుకుంటానని ట్రంప్ పలుమార్లు పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వీరిద్దరి మధ్య భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది.






