Donald Trump :డొనాల్డ్ ట్రంప్‌కు కూడా అదే సమస్య : వైట్‌హౌస్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump )నకు దీర్ఘకాల సిరల వ్యాధి ( వీనస్ ఇన్‌సఫీషియెన్సీ)గా నిర్ధారణ అయింది. ఇది సాధారణ రక్తప్రసరణ వ్యాధి అని వైట్‌హౌస్ (White House) ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ (Caroline Leavitt) ప్రకటించారు. 70 ఏళ్లు దాడిన వారిలో సాధారణంగా ఇది కనిపిస్తుందని పేర్కొన్నారు. ట్రంప్ కాళ్ల దిగువ భాగంలో, చీలమండ వద్ద వాపు రావడంతో వైద్యులు పరీక్షించారు. దీన్ని సాధారణ సిరల లోపంగా నిర్ధారించారు. భయపడాల్సినంత పరిస్థితి లేదన్నారు. డీప్ వీన్ థ్రోంబీసిస్ ( రక్తనాళాల్లో రక్త గడ్డకట్టం ) లేదా ఆర్టీరియల్ వ్యాధి ( దమనులు మూసుకుపోవడం) కాదన్నారు. ఇతర వైద్యపరీక్షల్లో గుండె వైఫల్యం, కిడ్నీ (Kidney) వైఫల్యంగానీ లేదని తేలినట్లు తెలిపారు. ప్రస్తుతం ట్రంప్ ఆరోగ్యంగానే ఉన్నారని, ఆయన ఎలాంటి అసౌకర్యానికి గురువడం లేదన్నారు.