Washington DC :ఫెడరల్ నియంత్రణ లోకి వాషింగ్టన్ డీసీ : ట్రంప్
దేశ రాజధాని వాషింగ్టన్ డీసీ (Washington DC) హింసాత్మక గ్యాంగ్‌లు, రక్తపిపాసులైన నేరగాళ్లతో నిండిపోయిందంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump )వ్యాఖ్యానించారు. నేరాలను అడ్డుకట్ట వేసేందుకు రాజధానిలోని పోలీసు విభాగాన్ని ఫెడరల్ నియంత్రణలోకి తీసుకుంటున్నామని చెప్పారు. పోలీసులకు తోడుగా 800 మంది నేషనల్ గార్డ్స్ (National Guards ) ను కూడా మోహరిస్తామని ప్రకటించారు. నేషనల్ గార్డులు శాంతిభద్రతలను, పౌరులకు రక్షణను కల్పిస్తారన్నారు. అవసరమైతే మరింత మంది నేషనల్ గార్డులను తీసుకొస్తామని పేర్కొన్నారు. వైట్‌హౌస్ (White House) లో ఆయన మీడియాతో మాట్లాడారు. నగరంలో నేరాల రేటు 2024లో 30 ఏళ్ల కనిస్టానికి పడిపోయిందంటూ గణాంకాలు చెబుతుండగా నేరాలయమంగా మారిందని వ్యాఖ్యానించడం గమనార్హం. ట్రంప్ ఈ వారంలోనే ఫెడరల్ బలగాలు రాజధానికి చేరుకుంటాయని రక్షణ శాఖ మంత్రి పీట్ హెగ్సెత్ (Pete Hegseth ) తెలిపారు.






