Donald Trump : పుతిన్‌తో భేటీ… జెలెన్‌స్కీని ఆహ్వానించనున్న ట్రంప్!

రష్యా, ఉక్రెయిన్ యుద్ధం ముగింపు ప్రయత్నాల్లో భాగంగా ఈ నెల 15న అమెరికాలోని అలాస్కాలో రష్యా అధ్యక్షుడు పుతిన్ (Putin)తో జరగనున్న భేటీకి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ (Zelensky)ని ఆహ్వానించడానికి డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. శాంతి చర్చల్లో ఉక్రెయిన్‌ను భాగం చేయాలని బ్రిటన్ (Britain) , ఫ్రాన్స్, ఇటలీ, జర్మనీ, పోలండ్, ఫిన్లాండ్ (Finland) వంటి ఐరోపా దేశాలు అగ్ర రాజ్యానికి విజ్ఞప్తి చేసిన నేపథ్యంలో ఈ దిశగా ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.