ఉపాధ్యక్ష అభ్యర్థిత్వ రేసులో వివేక్ రామస్వామి టాప్
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ గెలిస్తే దేశ ఉపాధ్యక్షుడిగా ఎవరు ఉంటారనే దానిపై ఓ సర్వేలో భారతీయ మూలాలున్న వ్యాపారవేత్త వివేక్ రామస్వామి హాట్ పేవరెట్గా నిలిచారు. సౌత్ డకోటా గవర్నర్, రిపబ్లికన్ నాయకురాలు క్రిస్టీ నోయెమ్, వివేవ్ రామస్వామిలకు సమానంగా 15 శాతం ఓట్లు పడ్డాయి. ఈ పోలింగ్లో భారతీయ మూలాలున్న మరో నాయకురాలు, అమెరికా పార్లమెంట్ తొలి హిందూ సభ్యురాలు తులసి గబార్డ్కు కేవలం తొమ్మిది శాతం ఓట్లు పడ్డాయి. రాష్ట్రాలవారీగా రిపబ్లిక్ ప్రైమరీ ఎన్నికల్లో నిక్కీ హేలీని వెనక్కి నెట్టి ట్రంప్ వరస విజయాలు సాధిస్తుండటంతో పార్టీ తరపున అధ్యక్ష అభ్యర్థిగా ట్రంప్ పేరు దాదాపు ఖరారైంది. దాంతో ఉపాధ్యక్ష అభ్యర్థి ఎవరనేది ఇప్పుడు తేలాల్సి ఉంది.






