Donald Trump : వారందరినీ బయటకు విసిరేయాల్సిందే : ట్రంప్ హెచ్చరిక

యూఎస్ కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ ( సిబిపి) అధికారిపై అక్రమ వలసదారుడు కాల్పులు జరిపిన ఘటనపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) తీవ్రంగా స్పందించారు. అక్రమ వలస దారులను సరిహద్దు బయటకు విసిరేస్తామని చెప్పారు. దాడిచేసిన వ్యక్తిని 2023 ఏప్రిల్‌లో పట్టుకున్నప్పటికీ బహిష్కరించకుండా విడుదల చేశారని విమర్శించారు. జో బైడెన్ (Joe Biden) పాలనలో విడుదలైన ఒక అక్రమ వలసదారుడు న్యూయార్క్ (New York) లోని సీబీఐ అధికారిపై కాల్పులు జరిపాడు. అతడిని 2023 ఏప్రిల్‌లో సరిహద్దు వద్ద పట్టుకున్నారు. కానీ బహిష్కరించకుండా విడుదల చేశారు. కాల్పుల్లో సీబీఐ అధికారి (CBI officer) గాయపడినప్పటికీ దాడి చేసిన వ్యక్తితో ధైర్యంగా పోరాడి ధైర్యాన్ని ప్రదర్శించాడు. డెమోక్రాట్లు (Democrats )మన దేశాన్ని నేరస్థుల ఆక్రమణలతో నింపారు. ఇప్పుడు వారందరినీ బయటకు విసిరివేయాలి, లేదా కేసులు నమోదు చేయాలి, ఎందుకంటే వారు మళ్లీ తిరిగి వచ్చే అవకాశం ఇవ్వకూడదు. వారు చాలా ప్రమాదకరమైన వారని ట్రంప్ పేర్కొన్నారు.