Donald Trump : డొనాల్డ్ ట్రంప్ తొలి విదేశీ పర్యటన ఇదే!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) పశ్చిమాసియా పర్యటనలో భాగంగా నేడు సౌదీ అరేబియా (Saudi Arabia)కు చేరుకొన్నారు. ఆయనకు యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ (Mohammed bin Salman) స్వాగతం పలికారు. ట్రంప్ రెండోసారి అధికారం చేపట్టిన తర్వాత చేపట్టిన తొలి పెద్ద పర్యటన ఇదే. దీనిలో భాగంగా ఆయన సౌదీ, యూఏఈ, ఖతార్‌ను సందర్శించనున్నారు. ట్రంప్ వెంట అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో (Marco Rubio), రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్, వాణిజ్య మంత్రి హోవర్డ్ లుట్నిక్, ఇంధనశాఖ మంత్రి క్రిస్ రైట్ ఉన్నారు. పశ్చిమాసియా పర్యటన నాలుగు రోజుల పాటు జరగనుంది. తుర్కియేకు కూడా వెళ్లే అవకాశం ఉన్నట్లు ట్రంప్ స్వయంగా వెల్లడిరచారు. ఈ నెల 15 నుంచి ఉక్రెయిన్, రష్యా మధ్య చర్చలు ప్రారంభం కానున్న నేపథ్యంలో పుతిన్, జెలెన్‌స్కీ (Zelensky)తో నేరుగా చర్చించే అవకాశాలున్నాయి.