Donald Trump :అమెరికాన్ చిన్నారులకు .. ట్రంప్ కొత్త పథకం

అమెరికాలో జన్మించిన చిన్నారుల కోసం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) సరికొత్త పథకాన్ని తెర పైకి తెచ్చారు. 2025-29 మధ్య అమెరికా పౌరులకు జన్మించే ప్రతి చిన్నారి పేరిట 1,000 డాలర్ల సొమ్ముతో ఓ ఇన్వెస్ట్‌మెంట్ ఖాతా (Investment account)ను ప్రభుత్వం ఉచితంగా తెరుస్తుంది. వీటిని ట్రంప్ ఖాతాలుగా పిలవనున్నారు. ఈ విషయం శ్వేతసౌధం (White House)లో జరిగిన రౌండు టేబుల్ సమావేశంలో చర్చకు వచ్చింది. దీనిలో ఉబర్ (Uber) , గోల్డ్‌మన్స్ సాక్స్, డెల్ (Dell) టెక్నాలజీస్ వంటి సంస్థల సీఈవోలు పాల్గొన్నారు. 2024 జనవరి 31 తర్వాత నుంచి 2029 డిసెంబర్ 31 మధ్య జన్మించే అమెరికన్ పౌరులకు ఫెడరల్ ప్రభుత్వం ఏక మొత్తంగా 1,000 డాలర్లను ట్యాక్స్ డెఫర్డ్ ఖాతాలో జమచేస్తారు అని ట్రంప్ పేర్కొన్నారు. ఈ ఖాతాలను పిల్లల సంరక్షణకులు నియంత్రిస్తారు. వారి ఈ ఖాతాలో ప్రైవేటు కాంట్రిబ్యూషన్ కింద ఏటా 5,000 డాలర్ల వరకు జమచేసే అవకాశం ఉంది.