Donald Trump :డొనాల్డ్ ట్రంప్ మరో షాకింగ్ నిర్ణయం… ఆ ఉద్యోగులందరికీ!

అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఫెడరల్ డైవర్సిటీ, ఈక్విటీ, ఇన్‌క్లూజన్ సిబ్బంది అందరికీ లేఆఫ్ (Layoffs) లు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు వారందరినీ సెలవులో ఉంచాలని ఆదేశిస్తూ ట్రంప్ కార్యవర్గం ఓ మెమో జారీ చేసింది. అమెరికా ఫెడరల్ ప్రభుత్వానికి చెందిన డైవర్సిటీ, ఇన్‌క్లూజన్ ప్రోగ్రామ్‌లను నిర్వీర్యం చేస్తూ ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై సంతకం చేశారు. ఈ నేపథ్యంలోనే సిబ్బంది నిర్వహణ కార్యాలయం మెమో(Memo) విడుదల చేసింది. దాని ప్రకారం డైవర్సిటీ, ఈక్విటీ, ఇన్‌క్లూజన్ (డీఈఐ) సిబ్బంది అందరినీ బుధవారం సాయంత్రం 5 గంటల్లోగా వేతనంతో కూడిన సెలవుపై పంపించాలని సంబంధిత ఏజెన్సీ(Agency)లకు ఆదేశాలు అందాయి. ఈ విభాగాలకు చెందిన వెబ్ పేజీలను కూడా ఈ గడువులోగా తొలగించాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.