Elon Musk: ఎలాన్ మస్క్ కొత్త పార్టీ .. పేరు ఇదేనా?

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump)తో విభేదాల వేళ బిలియనీర్ ఎలాన్ మస్క్ (Elon Musk) ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మధ్య వయస్కులో 80 శాతం మందికి ప్రాతినిధ్యం వహించే తాను కొత్త రాజకీయ పార్టీ (New political party) ప్రారంభించడానికి ఇది సరైన సమయమేనా అని ఆయన ఎక్స్‌లో తనకున్న 20 కోట్ల మందికి పైగా ఫాలోవర్లను ప్రశ్నించారు. అందులో 400,000 మంది తన ప్రశ్నకు స్పందించారని, అందులో 83 శాతం మంది మూడో, మధ్య స్థాయిక పార్టీకి అనుకూలంగా స్పందించారని మస్క్ తెలిపారు. ది అమెరికా పార్టీ (The America Party) అంటూ మస్క్ ఈ పోస్ట్ చేయడంతో ప్రపంచ కుబేరుడు ఇదే పేరుతో కొత్త పార్టీ పెట్టబోతున్నారంటూ ప్రచారం మొదలైంది. దీనిపై మస్క్ నుంచి ఇంకా అధికారక ప్రకటన మాత్రం రాలేదు.