Obama :ఒబామాతో చెప్పిన విషయం అదే : ట్రంప్

అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా (obama) కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ (Donald )ల మధ్య జరిగిన సీక్రెట్ సంభాషణలకు సంబంధించిన దృశ్యాలు ఇటీవల వైరల్ అయిన విషయం తెలిసిందే. తాజాగా దీనిపై ట్రంప్ స్సందిస్తూ వారిద్దరి మధ్య జరిగిన సంభాషణ గురించి వెల్లడిరచారు. పరస్పరం ఇష్టపడే ఓ ఇద్దరు వ్యక్తుల్లా ఇప్పుడు మనం కనిపిస్తున్నాం అని చెప్పా అంటూ ట్రంప్ పేర్కొన్నారు. అమెరికా మాజీ అధ్యక్షుడు జిమ్మి కార్టర్ (Jimmy Carter ) అంత్యక్రియలు ఇటీవల జరిగాయి. ఈ కార్యక్రమానికి ప్రస్తుత అధ్యక్ష, ఉపాధ్యక్ష దంపతులతో పాటు మాజీ అధ్యక్షులు హాజరయ్యారు. ఈ క్రమంలోనే బరాక్ ఒబామా, కాబోయే అధ్యక్షుడు ట్రంప్‌ల మధ్య ఓ సీక్రెట్ సంభాషణ జరిగింది. రాజకీయ ప్రత్యర్థులైన వీరిరువురూ ఏం చర్చించుకున్నారు అనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలో వారి సంభాషణను కొందరు లిప్ రీడర్లు అంచనా వేసేందుకు ప్రయత్నించారు. ఓ విషయం గురించి మాట్లాడాలని అయితే తాను ఇప్పుడు మాట్లాడలేనని, ఓ ప్రశాంతమైన ప్రదేశం కావాలని ట్రంప్ చెప్పినట్లు వారు కొనుగొన్నారు.