Citizenship : జన్మత పౌరసత్వంపై ట్రంప్‌నకు వ్యతిరేకంగా .. కోర్టు తీర్పు

జన్మత పౌరసత్వం కల్పించే విధానాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) రద్దు చేయడం రాజ్యాంగ విరుద్ధమని అమెరికా ఫెడరల్ అప్పీళ్ల కోర్టు స్పష్టం చేసింది. ట్రంప్ నిర్ణయం దేశావ్యాప్తంగా అమలు చేయరాదని పేర్కొంటూ కిందిస్థాయి కోర్టు వెలువరించిన నిర్ణయాన్ని సమర్థించింది. 9వ అప్పీళ్ల సర్క్యూట్ కోర్టుకు చెందిన ముగ్గురు జడ్జీల కమిటీ (Judges Committee) ఈ ఆదేశాలు జారీ చేసింది. తదుపరి ఈ అంశం అమెరికా సుప్రీంకోర్టు (Supreme Court) సమక్షానికి వచ్చే అవకాశం ఉంది. అక్రమంగా, లేదా తాత్కాలికంగా వలసవచ్చిన జంటలకు అమెరికా (America)లో జన్మించిన పిల్లలకు జన్మత పౌరసత్వం అందించే విధానాన్ని రద్దు చేస్తూ డొనాల్డ్ ట్రంప్ యంత్రాంగం తీసుకున్న నిర్ణయం అమలులోకి రాకుండా తాజా తీర్పు అడ్డుకుంటుంది. జన్మత లభించే పౌరసత్వాన్ని రద్దు చేయడం ద్వారా ట్రంప్ యంత్రాంగం రాజకీయ ప్రయోజనం కోసం రాజ్యాంగాన్ని ఉల్లంఘించిందని న్యాయమూర్తి అన్నారు.