America :అమెరికాలో జన్మత పౌరసత్వం రద్దుపై 22 రాష్ట్రాల న్యాయపోరాటం

జన్మత లభించే పౌరసత్వాన్ని రద్దుచేస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald trump) తీసుకున్న నిర్ణయంపై డెమోక్రటిక్ పార్టీ (Democratic Party) నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. డెమోక్రాట్ల పాలనలో ఉన్న 22 రాష్ట్రాలు ఈ నిర్ణయాన్ని న్యాయ స్థానాల్లో సవాలు చేస్తూ రెండు వేర్వేరు వ్యాజ్యాలు దాఖలు చేశాయి. అధ్యక్షుడి నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమని కాలిఫోర్నియా అటార్నీ జనరల్ వెల్లడిరచారు. ఉత్తర్వులను వెంటనే నిలిపివేయాలని తమ వ్యాజ్యంలో కోర్టును కోరారు.