సీక్రెట్ సర్వీస్ వైఫల్యమే .. ట్రంప్‌పై కాల్పుల కేసులో డైరెక్టర్
పెన్సిల్వేనియాలో ట్రంప్‌పై కాల్పుల ఘటన సీక్రెట్ సర్వీస్ తీవ్ర వైఫల్యమేనని ఆ సంస్థ డైరెక్టర్ కింబర్లీ కియాటిల్ అంగీకరించారు. భద్రతా వైఫల్యానికి తానే పూర్తి బాధ్యత వహిస్తానని పేర్కొన్నారు. కాల్పుల ఘటనపై అమెరికా కాంగ్రెస్ తొలి విచారణ జరిగింది. కమిటీ సభ్యుల ఎదుట కింబ్లరీ హాజరై వివరణ ఇచ్చారు. ఈ ఘటన ఎలా జరిగిందో దర్యాప్తు జరుపుతున్నాం. దిద్దుబాటు చర్యలను చేపట్టాం. భవిష్యత్తులో ఇంకెప్పుడూ జరగకుండా చూసుకుంటాం అని అమె పేర్కొన్నారు. సాయుధ దుండగుడు అత్యంత సమీపానికి ఎలా రాగలిగారని కమిటీ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కియాటిల్ రాజీనామా చేయాలని, లేదంటే బైడెన్ ఆమెను తొలగించాలని డిమాండు చేశారు.






