Donald Trump : యుద్ధం ముగించాలని పుతిన్‌కు లేదు : ట్రంప్

ఉక్రెయిన్‌తో యుద్ధం ముగించాలని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ (Vladimir Putin) కోరుకోవడం లేదని యూరప్ నేతలతో ప్రైవేట్ సంభాషణలో భాగంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) పేర్కొన్నారు. ఈ యుద్ధంలో మాస్కో పైచేయి సాధించినట్టుగా ఆయన భావిస్తున్నారని, శాంతిని కోరుకోవడం లేదని వెల్లడిరచారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ (Zelensky), ఇటలీ పీఎం జార్జియా మెలోనీ (Georgia Meloni), యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా వాన్ డెర్ లేయన్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మాక్రాన్ (Emmanuel Macron) , జర్మనీ ఛాన్స్‌లర్ ఫ్రెడ్‌రిచ్ మెర్జ్‌తో ప్రైవేట్ సంభాషణల సందర్భంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పై విధంగా స్పందించారు.