Donald Trump : వారికి నిధులిస్తే తీవ్ర పరిణామాలు : డొనాల్డ్ ట్రంప్ హెచ్చరిక

ఒకప్పటి తన కీలక మద్దతుదారు, ఎన్నికల్లో ఆర్థికంగా అండదండలు అందించిన ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ (Elon Musk) పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఆయనతో సంబంధం ముగిసిందని అంగీకరించారు. తన ప్రత్యర్థులైన డెమొక్రాట్ల (Democrats )కు నిధులు అందజేస్తే చాలా తీవ్ర పరిణామాలు ఉంటాయని ఆయనను హెచ్చరించారు. తన ప్రభుత్వం ప్రతిపాదించిన వ్యయ నియంత్రణ బిల్లుకు మద్దతు ఇస్తున్న రిపబ్లికన్ల (Republicans)ను సవాలు చేసే డెమొక్రాటిక్ సభ్యులకు ఆర్థిక సాయం అందజేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని తెలిపారు. అయితే ఆ పరిణామాలు ఏమిటో ఆయన వివరించలేదు.