Maga : మాగా ఉద్యమానికి వారసుడు వాన్స్ : ట్రంప్

దేశాన్ని గొప్పగా మార్చేందుకు తాను చేపట్టిన ఉద్యమానికి వారసుడు దేశ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ (J.D. Vance) అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయని తాను భావిస్తున్నట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) పేర్కొన్నారు. మేక్ అమెరికా గ్రేట్ ఎగెయిన్ (మాగా) అన్న నినాదంతో ప్రారంభించిన ఉద్యమంలో విదేశాంగ మంత్రి మార్కో రూబియో (Marco Rubio) కూడా చేరవచ్చని ఆయన అన్నారు. మాగా (Maga) ఉద్యమానికి వారసుడెవరంటూ అడిగిన ప్రశ్నకు ట్రంప్ ఈ విధంగా బదులిచ్చారు. అప్పుడే వారసుడెవరన్న విషయంపై మాట్లాడటం సరికాదు. అయితే వాన్స్ చాలా బాగా పనిచేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితిలో ఆయనే ఇష్ణుడు అని ట్రంప్ పేర్కొన్నారు.