Jill Biden :జిల్ బైడెన్ కు మోదీ ఇచ్చిన వజ్రంపై శ్వేతసౌధంలో చర్చ
అధికారంలో ఉండగా దేశాధ్యక్షుడికి, ఆయన సతీమణికి అందే బహుమతుల్ని ప్రభుత్వానికి అప్పగించే సంప్రదాయం అమెరికాలో అమలులో ఉంది. ఎవరెవరు ఏయే బహుమానాలిచ్చారో నమోదు చేసి ప్రభుత్వానికి అప్పగించేస్తారు. ఈ క్రమంలో భారత ప్రధాని మోదీ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (jill biden) కు, ఆయన భార్య జిల్ బైడెన్(Jill Biden )కు ఇచ్చిన బహుమతుల విషయం బయటకు వచ్చింది. 2023, జూన్‌లో అమెరికా అధ్యక్ష భవనంలో జరిగిన అధికారిక విందుకు మోదీ(MODI) అతిథిగా హాజరయ్యారు. ఆ సందర్భంగా ఆయన బైడెన్ భార్య జిల్ బైడెన్‌కు 20 వేల డాలర్లు విలువ చేసే ఒక వజ్రాన్ని(Diamond) బహూకరించారు. ఆ ఏడాదిలో జిల్ బైడెన్‌కు ప్రపంచ దేశాధినేతల నుంచి అందిన బహుమతుల్లో అతి ఖరీదైనది అదేనని అమెరికా విదేశాంగ శాఖ ప్రకటించింది. మోదీ బహూకరించిన వజ్రం ఖరీదు అప్పటి విలువ ప్రకారం రూ.16 లక్షలు. అదే విందులో అమెరికా అధ్యక్షుడికి గంధపుచెక్కతో చేసిన ఒక పెట్టే, టెన్ ప్రిన్సిపుల్స్ ఆఫ్ ఉపనిషద్స్ అనే పుస్తకం, ఒక విగ్రహం, ఒక దీపాన్ని మోదీ బహూకరించారు. బైడెన్ సతీమణికి మోదీ ఇచ్చిన వజ్రాన్ని అధ్యక్ష భవనంలోని ఈస్ట్వింగ్లో వినియోగించాలని నిర్ణయించినట్లు అమెరికా విదేశాంగ శాఖ వెల్లడిరచింది.






