Modi : త్వరలోనే మోదీ, ట్రంప్ భేటీ!

ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) , అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) త్వరలో భేటీ అయ్యే అవకాశముంది. ఈ ఏడాది చివర్లోగానీ, వచ్చే ఏడాది ప్రారంభంలోగానీ క్వాడ్ (Quad ) సదస్సు ను నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందుతున్నాయని, ఈ సదస్సు కోసం జపాన్, అమెరికా, ఆస్ట్రేలియా నేతలకు భారత్ ఆతిథ్యమివ్వనుందని అమెరికా ప్రభుత్వంలోని సీనియర్ అధికారి ఒకరు వెల్లడిరచారు. ఆ సమయంలో మోదీ, ట్రంప్ భేటీ కావొచ్చని తెలిపారు.