అంగీకారంతోనే ఆమెను కలిశా… ట్రంప్ రక్షణమంత్రి
డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వంలో రక్షణ మంత్రిగా బాధ్యతలు చేపట్టనున్న పీట్ హెగ్సెత్ తనపై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలను ఖండించారు. పరస్పర అంగీకారంతోనే ఆ మహిళను కలిసినట్లు తెలిపారు. 2017 అక్టోబరులో పీట్ హెగ్సెత్ తనను లైంగికంగా వేధించారని ఓ మహిళ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. కాలిఫోర్నియాలోని ఓ హోటల్లో తన ఫోన్ను హెగ్సెత్ లాక్కున్నారని, తలుపులు మూసి వేశారని, బయటకు వెళ్లనీయలేదని వివరించారు. దీనికి సంబంధించిన దర్యాప్తు నివేదికను పోలీసులు బయటపెట్టారు. అయితే ఇద్దరి మధ్య అంగీకారంతోనే కలిశామని, అక్కడ తప్పేమీ జరగలేదని హెగ్సెత్ వివరణ ఇచ్చినట్లు పోలీసు నివేదికలో ఉంది. దీనిపై హెగ్సెత్ న్యాయవాది స్పందించారు. 2023లో ఆమెకు పరిహారం ఇచ్చి సెటిల్ చేసుకున్నామని తెలిపారు.






