ట్రంప్ టారిఫ్‌లపై ఆసియాన్ దేశాల్లో.. భయాందోళనలు
అమెరికా అధ్యక్షునిగా డొనాల్డ్ ట్రంప్ ఎన్నికైన నేపథ్యంలో ఎగుమతుల ఆధారిత ఆగ్నేయాసియా దేశాల్లో భయాందోళనలు నెలకొన్నాయి. దిగుమతి చేసుకున్న వస్తువులపై టారిఫ్‌లను పెంచుతామంటూ ట్రంప్ తన ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ కారణంగా ప్రాంతీయ దేశాల ఆర్థిక వ్యవస్థలన్నీ పోటీ పడాల్సి వుంటుందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. అమెరికాకు ఆసియాన్ ఎగుమతులు బలమైన ప్రతికూలతలంటూ ప్రచారం సాగిస్తున్న ట్రంప్ తాను వైట్‌హౌస్‌కు రాగానే టారిఫ్‌లు పెంచుతానంటూ బెదిరింపులకు దిగుతున్న సంగతి విదితమే. మరింత రక్షణవాదంతో ట్రంప్ అనుసరించే విధానాల వల్ల ఆసియాన్ సింగపూర్ అంతర్జాతీయ వ్యవహారాల సంస్థ ప్రతినిధి ఒకరు వ్యాఖ్యానించారు. ఈ విషయాన్ని మే బ్యాంక్ కూడా తన నోట్లో పేర్కొంది. ఆగ్నేయాసియాకు పెట్టుబడుల రాక కూడా తగ్గుతుందని, ప్రతి ద్రవ్యోల్బణ షాక్ తగులుతుదని తెలిపింది. ఈ టారిఫ్‌ల వల్ల అమెరికా కంపెనీలకు రాయితీలు పెరుగుతాయని, ఫలితంగా ఆసియాన్ దేశాలకు ప్రత్యక్ష విదేశీ పెట్టుబడులు దెబ్బ తింటాయని ఆ సంస్థ పేర్కొంది.






