Donald Trump: త్వరగా ముగుస్తుందని ఆశిస్తున్నా : ట్రంప్

ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor)పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) స్పందించారు. ఈ ఘర్షణలు త్వరగా సమసిపోతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. దాడుల (Attacks) గురించి నేను విన్నాను. ఇది సిగ్గుచేటు. గతంలో జరిగిన ఘటనల దృష్ట్యా ఏదో జరగబోతోందని ప్రజలకు తెలుసునని నేను భావిస్తున్నా. వారు చాలా కాలంగా పోరాడుతున్నారు. ఎన్నో దశాబ్దాలు పోరాడుతున్నారు అని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఇరుదేశాలకు ఏదైనా సందేశం (Message) ఇవ్వాలనుకుంటున్నారా అని ప్రశ్నించగా లేదు, అది చాలా త్వరగా ముగుస్తుందని నేను ఆశిస్తున్నాను అని సమాధానమిచ్చారు.