బలమైన నాయకుడు ప్రారంభించరు.. వాటిని ఆపుతారు : నిక్కీ హేలీ
రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌నకు ఆ పార్టీ కీలక నేత నిక్కీ హేలీ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. మిల్వాకీలో జరిగిన నేషనల్ కన్వెన్షన్‌లో ఆమె ప్రసంగించారు. బలమైన అధ్యక్షుడు ఉంటే యుద్ధాలు జరగవంటూ ట్రంప్‌పై ప్రశంసలు కురిపించారు. ట్రంప్‌నకు ఓటేయాలంటే ఆయనతో 100 శాతం ఏకీభవించాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు. ఒబామా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు పుతిన్ క్రిమియాను ఆక్రమించారు. బైడెన్ అధికారంలో ఉండగా, మొత్తం ఉక్రెయిన్‌పైనే దండెత్తారు. ట్రంప్ అధికారంలో ఉన్నపుడు మాత్రం పుతిన్ ఏమీ చేయలేదు. ఆక్రమణలు, యుద్ధాలు ఏమీ లేవు. ట్రంప్ కఠినంగా వ్యవహరిస్తారని తెలిసే అప్పట్లో పుతిన్ ఉక్రెయిన్ను ఆక్రమించే ప్రయత్నం చేయలేదు. బలమైన నాయకుడు యుద్ధాలను ప్రారంభించరు. వాటిని ఆపుతారు అని వ్యాఖ్యానించారు.






