H1B VISA :అమల్లోకి హెచ్ 1 బీ వీసా కొత్త నిబంధనలు

అమెరికాలో హెచ్-1బీ వీసా (H1B VISA) ప్రోగ్రామ్‌కు సంబంధించి కొత్త నిబంధనలు అమలులోకి వచ్చాయి. ఇకపై ఎఫ్-1 వీసా (F1 VISA )లపై ఉన్న విద్యార్థులు హెచ్-1బీకి మారే ప్రక్రియ సరళతరం కానుంది. వీసా పొడిగింపు దరఖాస్తుల ప్రాసెసింగ్ ప్రక్రియ వేగవంతం కానుంది. దరఖాస్తుదారులు కొత్తగా ప్రవేశపెట్టిన ఐ-129 ఫాంను ఉపయోగించడం తప్పనిసరి చేశారు. కంపెనీలు (Companies) తమ అవసరాలకు తగినట్లు నియామకాలు చేసుకొని పోటీ మార్కెట్‌లో నిలదొక్కుకొనే అవకాశం కల్పించారు. లాటరీ విధానంలో బల్క్‌గా దరఖాస్తులు సమర్పించే కంపెనీలపై కఠిన నిబంధనలు విధిస్తారు. యూనివర్సిటీలు (Universities) , పరిశోధన సంస్థలు ఇకపై ఎలాంటి పరిమితి లేకుండా ఏడాది పొడవునా దరఖాస్తులు సమమర్పించవచ్చు.