America: అమెరికాలో 40 వేల మంది ప్రభుత్వ ఉద్యోగుల రాజీనామా!

అమెరికాలో ప్రభుత్వ ఉద్యోగుల (Government employees) సంఖ్యను తగ్గించడమే లక్ష్యంగా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) తీసుకొచ్చిన బైఔట్ ప్యాకేజీ సత్ఫలితాలిస్తోంది. దాదాపు 40 వేల మంది ఉద్యోగులు తమ కొలువులకు రాజీనామా చేసేందుకు అంగీకరించినట్లు తెలుస్తోంది. బైఔట్ ప్రకారం ఉద్యోగం వదులుకునే వారికి సెప్టెంబరు (September) వరకూ వేతనం చెల్లిస్తారు. మొదట్లో సీఐఏ బైఔట్ (CIA buyout) పరిధిలోకి లేకపోయినా ఇప్పుడు ఆ విభాగం ఉద్యోగులనూ చేర్చారు. అయితే మొత్తం ఉద్యోగుల సంఖ్యలో రాజీనామా చేసేందుకు అంగీకరించింది 2 శాతం లోపేనని అధికార వర్గాలు తెలిపాయి. ట్రంప్ కార్యవర్గం 2 లక్షల మంది ఉద్యోగులు బైఔట్‌ను ఎంచుకుంటారని అంచనా వేసింది.