Donald Trump : డొనాల్డ్ ట్రంప్ ప్రకటన… రష్యా, ఉక్రెయిన్ మధ్య

రష్యా, ఉక్రెయిన్ దేశాల మధ్య ఒకవైపు యుద్ధం కొనసాగుతుండగానే మరోవైపు ఉభయదేశాల మధ్య పెద్ద ఎత్తున యుద్ధ ఖైదీల మార్పిడికి సంబంధించిన ప్రక్రియ పూర్తయిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ప్రకటించారు. ఖైదీల మార్పిడిలో భాగంగా 1,000 మంది యుద్ద ఖైదీలతో కూడిన జాబితాను రష్యాకు సమర్పించినట్టు ఉక్రెయిన్ మిలిటరీ ఇంటెలిజెన్స్ (Ukraine Military Intelligence ) అధికారి వెల్లడిరచిన ఒక రోజు తర్వాత తదనుగుణంగా ట్రంప్ ప్రకటన చేయడం అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇటీవల ఇరుదేశాల మధ్య ఇస్తాంబుల్ (Istanbul) లో ప్రత్యక్ష చర్చలు జరిగాయి. రష్యా, ఉక్రెయిన్ (Russia, Ukraine) దేశాల మధ్య కీలకమైన ఖైదీల మార్పిడికి సంబంధించిన ప్రక్రియ పూర్తయింది. అది అతి త్వరలోనే అమల్లోకి వస్తుంది. ఈ దిశగా సంప్రదింపులు జరిపిన ఇరుపక్షాలకు అభినందనలు. ఇది ఏదో ఒక అతిపెద్ద దానికి దారి తీస్తుంది అని పేర్కొన్నారు.