Kamala Harris:కాలిఫోర్నియా గవర్నర్ పోటీపై కమలా హారిస్ క్లారిటీ

అమెరికా మాజీ ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ (Kamala Harris) కాలిఫోర్నియా (California Governor) గవర్నర్‌గా పోటీ చేస్తున్నట్లు వార్తలు వినిపించాయి. అందుకోసం ఆమె ప్రయత్నాలు కూడా చేస్తున్నట్లు టాక్ నడిచింది. తాజాగా ఆ వార్తలపై కమలా హారిస్ స్పందించారు. కేవలం అదంతా చర్చ మాత్రమేనని కొట్టిపారేశారు. కాలిఫోర్నియా తన రాష్ట్రమని, ఇక్కడ ప్రజలను ప్రేమిస్తున్నట్లు చెప్పారు. లోతైన ఆలోచనల తర్వాత గవర్నర్ పదవికీ పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నట్లు పేర్కొన్నారు. గతంలో కాలిఫోర్నియా అటార్నీ జనరల్ (Attorney General) , యూఎస్ సెనేటర్ (US Senator) గా కమలా హారిస్ పని చేశారు. అయితే తన సేవ ఒక భాగానికే పరిమితం కాకూడదని ఆమె భావిస్తున్నట్లు సమాచారం. 2028 జరగబోయే అధ్యక్ష బరిపై ఆమె దృష్టి పెట్టినట్లు సమాచారం.