ఎన్నికల ముంగిట డొనాల్డ్ ట్రంప్‌కు భారీ ఊరట
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు ఎన్నికల ముంగిట భారీ ఊరట లభించింది. ట్రంప్ ఎదుర్కొంటున్న అధికార రహస్య పత్రాల కేసును ఫ్లోరిడాలోని ఫెడరల్ కోర్టు జడ్జి ఐలీన్ కెనన్ కొట్టిపావేశారు. ఆరోపణలను నమోదు చేసిన ప్రత్యేక న్యాయవాదిని రాజ్యాంగ నియామకాల నిబంధనలకు విరుద్ధంగా నియమించారన్న ట్రంప్ లాయర్ల వాదనతో ఆమె ఏకీభవించారు. దీంతో, ట్రంప్ ఎదుర్కొంటున్న అనేక కేసుల్లో ఎంతో తీవ్రమైందిగా భావిస్తున్న ఈ క్రిమినల్ కేసుకు అనూహ్యమైన ముగింపు వచ్చినట్లయింది. అధ్యక్షుడిగా ఉండగా ఎన్నో ముఖ్యమైన రహస్య పత్రాలను ఫ్లోరిడాలోని మార్`ఇ`లాగో ఎస్టేట్‌కు తరలించారని, వాటిని వెనక్కి తెచ్చే ప్రయత్నాలను అడ్డుకున్నారంటూ ట్రంప్‌పై అనేక అభియోగాలున్నాయి. తనపై ఇతర కేసులనూ కొట్టేయాలని ట్రంప్ కోరారు.






